News April 3, 2025
తిరుపతి: గంజాయి కేసులో GRP కానిస్టేబుల్ అరెస్ట్

డబ్బుకు ఆశపడి ఓ రైల్వే పోలీస్ పక్కదారి పట్టాడు. గూడూరుకు చెందిన అవినాశ్ సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. రైళ్లలో తనిఖీలు చేసే సమయంలో దొరికిన గంజాయిని తన ఫ్రెండ్ సునీల్ ద్వారా విక్రయిస్తున్నాడు. ఈక్రమంలో సునీల్ గూడూరు టూ టౌన్ పోలీసులకు చిక్కాడు. ఐదు ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సునీల్ ఇచ్చిన సమాచారంతో అవినాశ్ను అరెస్ట్ చేశామని సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.
Similar News
News November 16, 2025
విజయనగరం జిల్లాలో జాబ్ మేళా

AP:విజయనగరం జిల్లాలోని మహారాజ్ కాలేజీలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ITI, డిగ్రీ, పీజీ, ANM, GNM, BSc, MSc (నర్సింగ్), ఫార్మసీ ఉత్తీర్ణులై, 18- 45ఏళ్ల లోపు వారు అర్హులు. 280 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ కార్డ్ తప్పనిసరి. అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్: employment.ap.gov.in
News November 16, 2025
రేపు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News November 16, 2025
గోపాల్పేటకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

వనపర్తి సంస్థానంలో భాగంగా 1711లో గోపాల్పేట సంస్థానం ఏర్పడింది. చరిత్ర ప్రకారం.. వనపర్తి, గోపాల్పేట ఉమ్మడి ప్రాంతాలను పూర్వం పానుగంటి సీమ అని పిలిచేవారు. సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థానానికి, వనపర్తి, గోపాల్పేట సంస్థానాల మూలపురుషుడు జనంపల్లి వీరకృష్ణారెడ్డి పెద్ద కుమారుడైన వెంకటరెడ్డి గోపాలరావు పేరు మీదగా గోపాల్పేట అని పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.


