News March 7, 2025
తిరుపతి: గుండెపోటుతో ఈశ్వర్ రెడ్డి మృతి

రామచంద్రాపురం మండలంలోని నెన్నూరు పంచాయతీలోని 8వ వార్డు సభ్యుడు కుసాకల ఈశ్వర్ రెడ్డి ఇవాళ ఉదయం 5 గంటలకు నెన్నూరులోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈశ్వర్ రెడ్డి మృతి చెందడంతో పలు రాజకీయ నాయకులు నెన్నూరు సర్పంచ్, మిగిలిన వార్డు సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు.
Similar News
News December 5, 2025
పంచాయతీ ఎన్నికలు సజావుగా జరగాలి: పెద్దపల్లి కలెక్టర్

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 6న పిఓ, ఎపిఓలకు శిక్షణ ఇవ్వాలని, ఫారం 14 ఇచ్చిన వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు. పోలింగ్ సిబ్బంది సమయానికి హాజరయ్యేలా పర్యవేక్షించాలని చెప్పారు. జిల్లాలో 4 సర్పంచ్, 210 వార్డులు ఏకగ్రీవం కాగా, 95 పంచాయతీలు, 670 వార్డులకు డిసెంబర్ 11న పోలింగ్ జరుగనుందని తెలిపారు.
News December 5, 2025
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 124 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(<
News December 5, 2025
పోస్టల్ బ్యాలెట్ అందజేయాలి: అదనపు కలెక్టర్ నగేష్

పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా ఓటింగ్ సౌకర్యం కల్పించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశమై, వారికి కేటాయించిన విధులను సమర్థంగా నిర్వహించేందుకు తగిన సూచనలు, సలహాలు అందించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.


