News March 7, 2025
తిరుపతి: గుండెపోటుతో ఈశ్వర్ రెడ్డి మృతి

రామచంద్రాపురం మండలంలోని నెన్నూరు పంచాయతీలోని 8వ వార్డు సభ్యుడు కుసాకల ఈశ్వర్ రెడ్డి ఇవాళ ఉదయం 5 గంటలకు నెన్నూరులోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ఈశ్వర్ రెడ్డి మృతి చెందడంతో పలు రాజకీయ నాయకులు నెన్నూరు సర్పంచ్, మిగిలిన వార్డు సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు.
Similar News
News March 21, 2025
KMR: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి జిల్లా లోని వైద్య విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా డీసీహెచ్ఎస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. బాన్సువాడ, దోమకొండ, మద్నూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏరియా, సామాజిక ఆసుపత్రుల్లో 19 వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అర్హత కలిగిన వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేస్తామన్నారు.
News March 21, 2025
పెంబి: అన్నం పెట్టలేదని భార్యను చంపాడు!

అన్నం పెట్టడం లేదని భార్యని చంపాడో భర్త. ఖానాపూర్ పోలీసుల వివరాలు.. పెంబి పరిధిలోని దాసునాయక్ తండాకి చెందిన అర్జున్‌కు గోసంపల్లికి చెందిన నిరోజతో వివాహం జరిగింది. కాగా భర్త మద్యానికి బానిసై రోజు గొడవపడే వాడు. ఈ నెల 18న మద్యం తాగి వచ్చి భోజనం పెట్టలేదని గొడవపడ్డాడు. నిరోజను కిందపడేసి కొట్టి, గొంతుపై కాలువేసి తొక్కడంతో ఆమె మృతిచెందింది. నిరోజ అన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు.
News March 21, 2025
భద్రాద్రి: భార్య మందలించిందని.. భర్త ఆత్మహత్య

భార్య మందలించిందని భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని జగ్గుతండాలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రతీష్ వివరాలిలా.. జగ్గుతండాకు చెందిన అజ్మీరా మోహన్(47) మద్యానికి బానిసై, తరచూ మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోద చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.