News July 23, 2024
తిరుపతి: గుండెపోటుతో యువకుడు మృతి

గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన రామచంద్రాపురం మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. రేకలచేను గ్రామానికి చెందిన హేమంత్ (31) తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్తూ గుండెపోటుకు గురై పొలంలోని బురదలో కూరుకుపోయాడు. దీనిని గమనించి శునకాలు అరవసాగాయి. గుర్తించిన స్థానికులు అతనిని బయటకు తీశారు. మొదట కరెంట్ షాక్ తో మృతి చెందినట్లు భావించగా అధికారులు అక్కడికి వచ్చి పరిశీలించారు. షాక్ కొట్టలేదని నిర్ధారించారు.
Similar News
News October 13, 2025
చిత్తూరు పోలీసులకు 34 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. బాధితుల నుంచి 34 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వీటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఇందులో అత్యధికంగా భూతగాదాలపై 13 ఫిర్యాదులు అందాయి.
News October 13, 2025
చిత్తూరు: నేటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు

DSC-2025 ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఇవాళ వారికి కేటాయించిన పాఠశాలలో జాయిన్ కానున్నారు. ఈ మేరకు DEO వరలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. నూతన ఉపాధ్యాయులు 11 రోజుల శిక్షణ పూర్తిచేసుకున్నారు. SGTలకు మ్యానువల్ పద్ధతిలో స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించారు.
News October 13, 2025
చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఉదయం 10.30 గంటలకు పాత డీపీఓ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు ఇవ్వొచ్చని ఆయన కోరారు.