News January 9, 2025
తిరుపతి ఘటన బాధాకరం: AP గవర్నర్
తిరుపతిలో బుధవారం క్యూ లైన్లలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం, పలువురు గాయపడిన ఘటనపై AP గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Similar News
News January 10, 2025
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించండి
గురువారం నగరపాలక సంస్థ పరిధిలో 49వ వార్డు సచివాలయాన్ని అనంతపురం రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి.విశ్వనాథ్ తనిఖీ చేశారు. వార్డు పరిధిలో పన్నుల వసూళ్లపై సమీక్షించారు. వార్డు సచివాలయంలో కార్యదర్శులు హాజరు నమోదు, మూవ్మెంట్ రిజిస్టర్, పబ్లిక్ సర్వీసెస్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. వార్డు సచివాలయానికి వచ్చే ప్రజలతో సామరస్యంగా మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.
News January 9, 2025
తిరుపతికి కీలక నేతల రాక
మాజీ సీఎం జగన్ ఇవాళ తిరుపతి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు నగరానికి చేరుకుంటారు. స్విమ్స్ ఆసుపత్రిలో బాధితులను ఆయన పరామర్శిస్తారని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్, 4 గంటలకు నారా లోకేశ్ సైతం తిరుపతి వస్తారని సమాచారం. ఇప్పటికే సీఎం చంద్రబాబు అమరావతి నుంచి తిరుపతికి బయల్దేరారు. మరికాసేపట్లోనే రుయాలో బాధితులను పరామర్శిస్తారు.
News January 9, 2025
మరికాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబు
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో మరికాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబు రానున్నారు. 12 గంటలకు రేణిగుంట విమానశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గాన రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు చేరుకుంటారు.12 నుంచి 3 గంటల వరకు పరామర్శలు, టీటీడీ ఈఓ కార్యాలయంలో రివ్యూ నిర్వహిస్తారు. అనంతరం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకొని విజయవాడకు చేరుకుంటారని అధికారులు తెలిపారు.