News October 15, 2024
తిరుపతి, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వీరే

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. కేబినెట్లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా రాంప్రసాద్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News January 11, 2026
చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం జరగనున్న గ్రీవెన్స్ డేను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కార్యక్రమం జరగనుందని చెప్పారు. జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీ నమోదు, స్థితిపై 1100కి కాల్ చేయవచ్చన్నారు.
News January 11, 2026
కుప్పం ఏరియాకు భారీ ప్రాజెక్ట్

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మానేంద్రం గ్రామంలో విమాన తయారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. HANSA-3(NG) రెండు సీట్ల ట్రైనర్ విమానాల తయారీ, ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటుకు 55.47 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది. రూ.159 కోట్లతో రెండు దశల్లో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 250మందికి ఉపాధి లభించనుంది. ఏటా 108 విమానాల తయారీ చేయనున్నారు.
News January 11, 2026
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ కోడి కిలో రూ.185 నుంచి రూ.190, మాంసం రూ.268 నుంచి 290 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.305 నుంచి రూ.315 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు 12 కోడిగుడ్ల ధర రూ. 84గా ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


