News May 10, 2024

తిరుపతి చేరుకున్న నాగబాబు

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తిరుపతిలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు రోడ్‌షో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు శుక్రవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి వినుత, ఆమె భర్త చంద్రబాబుతో కలిసి నాగబాబుకు స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించారు. BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ఈ రోడ్ షోలో పాల్గొంటారు.

Similar News

News February 18, 2025

చిత్తూరులో 19, 20న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు 

image

చిత్తూరులో 19, 20 తేదీల్లో ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పీడీ వెంకటేశ్వరి తెలిపారు.19న మిషన్ వాత్సల్య పథకంలో ఒక కౌన్సిలర్, ఒక అవుట్ రీచ్ వర్కర్ పోస్టులు, 20న మిషన్ శక్తి పథకంలో ఖాళీగా ఉన్న 3 మల్టీపర్పస్ హెల్పర్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

News February 17, 2025

తిరుపతి నగరంలో దారుణ హత్య

image

తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో జగదీశ్ (40)అనే వ్యక్తిని సునీల్ అనే వ్యక్తి హత్య చేశాడు. మద్యం మత్తులో జగదీశ్ భార్యతో సునీల్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో సునీల్‌ను ప్రశ్నించడంతో పదునైన ఇనుప చువ్వతో జగదీశ్ గుండెలపై పొడిచాడు. తీవ్రగాయాలైన జగదీశ్‌ను ఆసుపత్రికి తరలించే లోపు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అలిపిరి సీఐ రామ్ కిషోర్ విచారణ చేస్తున్నారు. సునీల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

error: Content is protected !!