News January 10, 2026
తిరుపతి జిల్లాకు మరో కంపెనీ.. 2,000 ఉద్యోగాలు..!

వెబ్‌సోల్ రెన్యూవబుల్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో రూ.3,538 కోట్ల పెట్టుబడితో 4 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ సెల్స్, మాడ్యూళ్ల తయారీకి ఇంటిగ్రేటెడ్ యూనిట్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,980 ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు పరోక్షంగా వేలాది ఉపాధి అవకాశాలు కల్పించనుంది. రాష్ట్రానికి అదనపు పెట్టుబడులు ఆకర్షించడంలో ఇది కీలకంగా నిలవనుంది.
Similar News
News April 20, 2026
@4PM సింహాచలం: స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారంటే..!

సింహాచలంలో స్వామి నిజరూప దర్శనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు 81,238 మంది స్వామిని దర్శించుకున్నట్టు అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో బారులు తీరారు. వీరికి ఇబ్బంది కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే 6గంటల తరువాత భక్తులకు కొండ పైకి అనుమతించడం లేదన్నారు.
News April 20, 2026
NGKL: ఈ నెల 30న దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు

NGKL ఆర్టీసీ డిపో నుంచి ఈనెల 30న కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆశ్రమానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఈ బస్సు 30న రాత్రి డిపో నుంచి బయలుదేరి మే 1న శనివారం తెల్లవారుజామున దత్తాత్రేయ ఆశ్రమానికి చేరుకుంటుందన్నారు. ఉదయం దత్తాత్రేయ స్వామి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో యానగుంది మానికేశ్వరీ మాత ఆశ్రమ దర్శనం ఉంటుందన్నారు. వివరాలకు 9490411591 సంప్రదించాలన్నారు.
News April 20, 2026
సేంద్రియ మేళా సూపర్ హిట్: కలెక్టర్

లూరులో నిర్వహించిన ‘రైతు సంపద’ సహజ, సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళా విశేష స్పందనతో విజయవంతమైందని కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. రెండు రోజుల్లో 3,400 మంది సందర్శించగా, రూ. 11 లక్షల విక్రయాలు జరిగినట్లు వెల్లడించారు. వ్యవసాయ శాఖ జేడీ భాషా, అధికారులను సన్మానించిన కలెక్టర్.. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తు కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాను రాష్ట్రానికే ఆదర్శంగా నిలపాలని కోరారు.


