News February 1, 2025
తిరుపతి జిల్లాలో ఆగిన పెన్షన్ల పంపిణీ

తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాలలో సర్వర్ సమస్యల వల్ల పెన్షన్ల పంపిణీ ఆగినట్లు స్థానికులు తెలిపారు. తడ, పుత్తూరు, వడమాలపేట, తొట్టెంబేడు తదితర ప్రాంతాలలో ఈ సమస్య ఉన్నట్లు సమాచారం. వడమాలపేట(M) బుట్టిరెడ్డి కండ్రిగలో మొత్తం 250 పెన్షన్లు ఉండగా సర్వర్ సమస్యతో ఐదు పెన్షన్లనే పంపిణీ చేసినట్లు సిబ్బంది చెప్పారు.
Similar News
News December 5, 2025
సిరిసిల్ల: ‘మెరుగైన వైద్య సేవలు అందించాలి’

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో స్టాఫ్ నర్సులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ MLHPలతో ఆమె శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలన్నారు. సకాలంలో లక్ష్యాలు సాధించాలని పేర్కొన్నారు.
News December 5, 2025
రాజకీయాల్లోకి రమ్మని లోకేశ్ను ఫోర్స్ చేయలేదు: CBN

AP: పిల్లల్లోని ఇన్నోవేటివ్ ఆలోచనలు గుర్తించేందుకు స్టూడెంట్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తామని CM CBN PTMలో తెలిపారు. ‘నేనెప్పుడూ లోకేశ్ స్కూలుకు వెళ్లలేదు. టీచర్లతోనూ మాట్లాడలేదు. ఫౌండేషన్ ఇప్పించానంతే. చదువుకొని మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి రమ్మనీ ఫోర్స్ చేయలేదు’ అని అన్నారు. కష్టంగా ఉంటుందన్నా విద్యాశాఖనే ఎంచుకున్నారని చెప్పారు. విద్యార్థులు కలలు సాకారం చేసుకొనేలా అండగా ఉంటామన్నారు.
News December 5, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. రూ. 5.91 కోట్ల దుబారా!

NOVలో జరిగిన జూబ్లీ బైపోల్ నిర్వహణకు రూ.5.91 కోట్లు ఖర్చు చేసినట్లు RTI ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనిపై FGG అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త సిబ్బంది, వాహనాలు, పారామిలటరీ బలగాలు లేకుండా ప్రశాంతమైన జూబ్లీహిల్స్లో ఇంత భారీ ఖర్చు జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం వృథా జరిగిందని, వెంటనే ఖర్చుపై ఆడిట్ నిర్వహించి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలని FGG ECకి విజ్ఞప్తి చేసింది.


