News February 1, 2025
తిరుపతి జిల్లాలో ఆగిన పెన్షన్ల పంపిణీ

తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాలలో సర్వర్ సమస్యల వల్ల పెన్షన్ల పంపిణీ ఆగినట్లు స్థానికులు తెలిపారు. తడ, పుత్తూరు, వడమాలపేట, తొట్టెంబేడు తదితర ప్రాంతాలలో ఈ సమస్య ఉన్నట్లు సమాచారం. వడమాలపేట(M) బుట్టిరెడ్డి కండ్రిగలో మొత్తం 250 పెన్షన్లు ఉండగా సర్వర్ సమస్యతో ఐదు పెన్షన్లనే పంపిణీ చేసినట్లు సిబ్బంది చెప్పారు.
Similar News
News February 14, 2025
విధి నిర్వహణలో ఆయుధ పరిజ్ఞానం అవసరం: సీపీ

పోలీస్ విధుల నిర్వహణలో శాంతిభద్రతల రక్షణ, సాంకేతికతతో పాటు ఆయుధ పరిజ్ఞానం అవసరమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. శుక్రవారం నంగునూరు మండలం రాజగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫైరింగ్ ప్రాక్టీస్ రేంజిలో సీపీ పాల్గొని ఫైరింగ్ విధానాన్ని పరిశీలించారు. సమీపం నుంచి ప్రత్యర్థిని ఎదుర్కోవడం, ముష్కరులను నిరాయుధులను చేయడం, వ్యూహంగా మారి తలపడడం వంటి అంశాలపై ఆమె అవగాహన కల్పించారు.
News February 14, 2025
చిన్న క్రాకలో ఎమ్మెల్యే కాకర్ల ఫ్లెక్సీ చించివేత

జలదంకి మండలం చిన్న క్రాకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి చించివేశారు. చిన్న క్రాకలో ఓ చెరువు వద్ద ఒక వర్గం ఎమ్మెల్యే ఆయన సోదరుడు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు చించివేయడంతో రాజకీయంగా దుమారం లేపింది.
News February 14, 2025
తులసిబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనను సీఐడీ అరెస్టు చేసినప్పుడు తులసిబాబు తన గుండెలపై కూర్చొని దాడి చేశాడని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.