News February 28, 2025

తిరుపతి జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

image

✒ స్పోర్ట్స్ కోటాలో TTDలో ఉద్యోగాల భర్తీకి చర్యలు
✒ తిరుపతిలో అర్ధరాత్రి బ్యూటీపార్లర్‌లో అగ్ని ప్రమాదం
✒ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటి హన్సికా
✒ రోడ్డు ప్రమాదంలో MLA థామస్ బాబాయ్ మృతి
✒ రాష్ట్ర బడ్జెట్‌పై తిరుపతి MP విమర్శలు
✒ తిరుపతి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ ఈవో
✒ శ్రీకాళహస్తి RDO ఆఫీస్ వద్ద ధర్నా

Similar News

News January 9, 2026

394 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి B.Tech, BE, డిప్లొమా, ITI ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 – 26 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iocl.com *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News January 9, 2026

తిరుపతి: చిన్న అజాగ్రత్త.. ఒక ప్రాణాన్ని బలితీసుకుంది!

image

చంద్రగిరి(M) కందులవారిపల్లెలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీడీ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు అగ్గిపుల్ల మంచంపై పడటంతో మంటలు చెలరేగి, పాదిరి కేశవుల రెడ్డి అనే వృద్ధుడు గాయపడ్డారు. భార్య ఉన్నా ఆమె అనారోగ్యంతో మంచంపైనే ఉండటంతో ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. గ్రామస్థులు గమనించి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మరణించారు.

News January 9, 2026

NGKL జిల్లాలో విసిరిన చలి పంజా..!

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం ప్రకటించిన వివరాల ప్రకారం, కల్వకుర్తి మండలం తోటపల్లిలో అత్యల్పంగా 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి, ఊర్కొండ, బల్మూర్, అమ్రాబాద్ మండలాల్లోనూ 11 డిగ్రీల పరిధిలో చలి నమోదవుతోంది. పెరుగుతున్న చలితో ప్రజలు గజగజ వణుకుతున్నారు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది.