News August 7, 2024
తిరుపతి జిల్లాలో చిరుత సంచారం?

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం పరమాలలో అడవి జంతువు సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన శేషమ్మ సోమవారం రాత్రి తన పశువులను పొలాల సమీపంలో కట్టేసి ఇంటికి వచ్చారు. మంగళవారం ఉదయం పాలు పితికేందుకు వెళ్లగా తాడుకు కట్టేసిన దూడను చంపి తినడం గుర్తించారు. అటవీ బీట్ అధికారి కిషోర్ కుమార్ జంతువు పాద ముద్రలు సేకరించారు. దాడికి పాల్పడింది చిరుతా? లేదా రేసుకుక్కలా? అని తేలాల్సి ఉంది.
Similar News
News December 13, 2025
చిత్తూరు: ప్రభుత్వ స్కూళ్లలో కెరీర్ ఫెస్ట్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ ఫెస్ట్ నిర్వహించనున్నట్లు అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణ వెల్లడించారు. డిసెంబర్ 15 నుంచి 18 వరకు, అనంతరం 20న జిల్లాస్థాయి కెరీర్ ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ రంగాలు, విభాగాల్లో ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.
News December 13, 2025
చిత్తూరు: ALERT.. ఈ నెల 19 లాస్ట్.!

ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులు ఈనెల 19వ తేదీలోపు ఆన్ లైన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. టెన్త్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.150, ప్రాక్టికల్స్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలన్నారు.
News December 13, 2025
చిత్తూరు జిల్లాలో యూరియా కొరత లేదు

చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు ఎటువంటి ఎరువులు, యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. 2నెలల కాలంలో జిల్లాలో 4135 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్టు చెప్పారు. రాబోయే 21 రోజులకు 1,247 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. 2,117 టన్నులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


