News January 31, 2025
తిరుపతి జిల్లాలో దారుణ హత్య

అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన కోట మండలంలో చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా, కోట(M), జరుగుమల్లి గమళ్లపాళెంకు చెందిన కోటయ్య(46), మస్తానయ్య అన్నదమ్ములు. వీరు పక్కపక్కనే నివాసాలు ఉంటున్నారు. మస్తానయ్య భార్య గుడ్డలు ఉతికే క్రమంలో మురికినీరు అన్న కోటయ్య వాకాలిలోకి వెళ్లడంతో ఇద్దరు భార్యలు గొడవ పడ్డారు. ఈక్రమంలో కోటయ్య మస్తానయ్యపై దాడి చేయగా..తిరిగి మస్తానయ్య దాడి చేయడంతో కోటయ్య మృతి చెందాడు.
Similar News
News February 24, 2026
ఆదిలాబాద్: కీలక పాత్ర పోషిస్తున్న గ్రామ పాలన అధికారులు

ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు (జీపీఓలు) కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్యామల దేవి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జీపీఓ, ఆర్ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గతంలో వీఆర్ఓలు, వీఆర్ఏలుగా సేవలందించిన వారిని గ్రామ పాలన అధికారులుగా నియమించి గ్రామ స్థాయిలో జరిగే అంశాలను ప్రభుత్వానికి అందజేస్తూన్నట్లు తెలిపారు.
News February 24, 2026
ఇంగ్లండ్‌తో పోరు.. పాక్ స్కోరు ఎంతంటే..?

T20 WC సూపర్-8లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో పాక్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 164-9 పరుగులు చేసింది. ఓపెనర్ ఫర్హాన్(63) రాణించగా, బాబర్ ఆజమ్(25), ఫఖర్ జమాన్(25) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 3, ఓవర్టన్, ఆర్చర్ తలో 2, రషీద్ ఒక వికెట్ తీశారు.
News February 24, 2026
7 లక్షల మంది ఆస్తిహక్కు పత్రాలు తీసుకోలేదు: అనగాని

AP: పేదలకు ఇళ్ల పేరిట గత ప్రభుత్వంలో ₹6,000 కోట్లు స్వాహా చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ‘22 లక్షల మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే 7 లక్షల మంది కన్వేయన్స్ డీడ్స్ (ఆస్తిహక్కు పత్రాలు) తీసుకోలేదు. చెరువులు, ముంపు ప్రాంతాల్లో స్థలాలివ్వడంతో 2.5 లక్షల మంది అసలు పట్టాలే తీసుకోలేదు. తీసుకున్న వారిలో 43,948 మంది అనర్హులున్నారు. మరో 1,11,037 పట్టాలను పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు.


