News March 24, 2025

తిరుపతి జిల్లాలో నామినేటెడ్ పదవులు దక్కేదెవరికి.?

image

రాష్ట్రంలో త్వరలో మూడో విడత నామినేటెడ్ పదవుల జాబితా సిద్ధం అవుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో జిల్లాలో పలువురు పదవులు ఆశిస్తున్నారు. మాజీ MLA సుగుణమ్మ, మాజీ మంత్రి పరస్సా రత్నం, చంద్రగిరి నుంచి డాలర్ దివాకర్ రెడ్డి, సత్యవేడు నుంచి TDP తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ హేమలత, తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ తదితరులు ఉన్నారు. పార్టీ కోసం పని చేశామని ఈ సారైనా పదవులు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 10, 2025

మా దేశం పేరు సంస్కృతం నుంచే వచ్చింది: సింగపూర్ మాజీ డిప్యూటీ PM

image

సింగపూర్ లేదా సింగపురా అనే పేరు సంస్కృతం నుంచి ఉద్భవించిందని ఆ దేశ మాజీ ఉప ప్రధాని తియో చీ హియాన్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన అటల్ బిహారీ వాజ్‌పేయి మెమోరియల్ లెక్చర్‌లో ఆయన మాట్లాడుతూ భారత్-సింగపూర్ చారిత్రక అనుబంధం గురించి వెల్లడించారు. 1867 వరకు కోల్‌కతా నుంచి సింగపూర్ పరిపాలన జరిగిందని గుర్తుచేశారు. తమ దేశ ఆర్థిక, సాంస్కృతిక నిర్మాణంలో భారతీయులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు.

News December 10, 2025

బొదులూరు పీహెచ్సిని ఆకస్మిక తనిఖీలు చేసిన ఐటీడీఏ పీవో

image

మారేడుమిల్లి మండలంలోని బొదులూరు పీహెచ్సిని రంపచోడవరం ఐటీడీఏ పీఓ స్మరన్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్యం అందుతుందా, వైద్య పరీక్షలు చేస్తున్నారా అనే వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి పంపించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

News December 10, 2025

కడప: టెట్ పరీక్ష.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

image

కడప జిల్లాలో ఇవాళ్టి నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 15,082 మందికి 8 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏవైనా బ్బందులు ఉంటే 9959322209, 9849900614, 9948121966 నంబర్లకు సంప్రదించాలని DEO శంషుద్దీన్ సూచించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు.