News March 24, 2025
తిరుపతి జిల్లాలో నామినేటెడ్ పదవులు దక్కేదెవరికి.?

రాష్ట్రంలో త్వరలో మూడో విడత నామినేటెడ్ పదవుల జాబితా సిద్ధం అవుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో జిల్లాలో పలువురు పదవులు ఆశిస్తున్నారు. మాజీ MLA సుగుణమ్మ, మాజీ మంత్రి పరస్సా రత్నం, చంద్రగిరి నుంచి డాలర్ దివాకర్ రెడ్డి, సత్యవేడు నుంచి TDP తరఫున టికెట్ ఆశించి భంగపడ్డ హేమలత, తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ తదితరులు ఉన్నారు. పార్టీ కోసం పని చేశామని ఈ సారైనా పదవులు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 18, 2025
గుడ్‌ప్రైడే ఎందుకు జరుపుకుంటారో తెలుసా!

గుడ్ ఫ్రైడే రోజున ఏసుక్రీస్తు శిలువపై మరణించారని క్రైస్తవులు విశ్వసిస్తారు. మానవాళి సంక్షేమం కోసం ప్రేమ, కరుణ, క్షమాపణ లాంటి గొప్ప సద్గుణాల్ని ఏసు బోధిస్తుంటారు. అది నచ్చని అప్పటి రాజులు క్రీస్తును శిలువ వేస్తారు. ఆ రోజునే క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. నల్లని వస్త్రాలు ధరించి తమ పాపాలకు ఏసును క్షమాపణ అడుగుతారు. ఇది జరిగిన 3వ రోజు ఆయన మళ్లీ జన్మించారనే నమ్మకంతో ఈస్టర్ డే జరుపుకుంటారు.
News April 18, 2025
భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై ఆయన అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
News April 18, 2025
అన్నమయ్య : ఏకకాలంలో తనిఖీలు

సంఘ విద్రోహక చర్యలను అరికట్టేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఏక కాలంలో వాహనాలను తనిఖీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో గురువారం రాత్రి జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సోదాలు చేశారు. రాత్రి 9 నుంచి ఆటో, బైక్ కార్, లారీ, బస్సుల పరిశీలుంచారు. ముఖ్యమైన ప్రదేశాలు, రహదారుల్లో పికెట్ ఏర్పాటు చేశారు.