News March 16, 2025

తిరుపతి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

image

తిరుపతి జిల్లాలో పదో తరగతి పరీక్షలకు వేళాయె• మార్చి 17 నుంచి పదవ తరగతి పరీక్షలు• తిరుపతి జిల్లాలో 28,656 మంది పదవ తరగతి విద్యార్థులు• జిల్లాలో 164 పరీక్షా కేంద్రాల ఏర్పాటు• 30 సిట్టింగ్ స్వ్కాడ్లు, 10 ఫ్లైయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు• ఇప్పటికే విడుదలైన హాల్ టికెట్లు• పరీక్ష సమయం: ఉ.9:30 నుంచి మ.12:30 వరకు• పరీక్షకు ఒక రోజు ముందే హాల్ టికెట్, పెన్నులు, ప్యాడ్ తదితరవి సిద్ధం చేసుకోండి

Similar News

News November 21, 2025

BREAKING: మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ బదిలీ.. కొత్త ఎస్పీగా శబరీష్

image

మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీగా శబరీష్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో శబరీష్ ములుగు జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వహిస్తూ బదిలీల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌ను ములుగు జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులను వెలువరించింది.

News November 21, 2025

వికారాబాద్ నూతన ఎస్పీగా స్నేహ మెహ్రా

image

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా స్నేహ మెహ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీగా నారాయణరెడ్డి ఉన్న సమయంలోనే లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటన జరిగింది.

News November 21, 2025

ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధన ప్రారంభం

image

శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్ డా.టి.రవిరాజు అన్నారు. ఉద్దానం ప్రాంతంలో 18% జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.6.01కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఇచ్చాపురం, కంచిలి, పలాస, కవిటి, మందస, వజ్రపు కొత్తరు ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్నామన్నారు.