News January 30, 2025

తిరుపతి జిల్లాలో పెన్షన్లకు రూ.112.19 కోట్లు

image

తిరుపతి జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన 2,63,191 మంది పెన్షన్ దారులకు రూ.112.19 కోట్లు పంపిణీ చేయనున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శనివారం 100 శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన పెన్షన్ ఇస్తున్న విషయం ప్రతి పెన్షన్ దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలని తెలిపారు.

Similar News

News November 19, 2025

సింహాద్రిపురం: అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

image

సింహాద్రిపురం మండలంలోని బిందెనంచెర్ల చెందిన ముత్తులూరు పెద్దిరెడ్డి(47) అనే చీని అన్నదాత మంగళవారం చెరువుకట్ట వద్దకు వెళ్లి విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రైతుకు ఐదు ఎకరాల చీనీ తోట ఉంది. పంట సాగుకు, కుటుంబ అవసరాలకు రూ.20 లక్షలు అప్పులు చేశాడు. చీనీ కాయలకు ధరలు లేకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News November 19, 2025

లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా!

image

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ లోకల్ జర్నలిస్టుకు ఈ లెటర్ రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ‘జోహార్.. మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా (లొంగిపోయేందుకు) కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలి’ అని లేఖలో ఉన్నట్లు పేర్కొంది.

News November 19, 2025

నాగర్‌కర్నూల్‌లో పెరిగిన చలి

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెల్దండ మండలం బొల్లంపల్లిలో కనిష్ఠ ఉష్ణోగ్రత 13.2గా నమోదైంది. అమ్రాబాద్, తోటపల్లిలో 13.9, సిర్సనగండ్లలో 14.1 ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో అధిక చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.