News February 25, 2025
తిరుపతి జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదు: కలెక్టర్

తిరుపతి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి లేదని.. ప్రజలందరూ చికెన్, కోడిగుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చునని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్.పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారి, డీఆర్వో నరసింహులుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధిపై వస్తున్న అపోహలపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదని చెప్పారు.
Similar News
News March 16, 2025
ADB: ఏప్రిల్ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు నిర్వహించనున్నట్లు DEO ప్రణీత ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News March 16, 2025
KNR: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు ఎప్పుడో?

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాల విద్యార్థులు తమ డిగ్రీ ఫలితాలు ఎప్పుడా అన్నట్లుగా ఎదురుచూస్తున్నారు. డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ BSC, BCOM రెగ్యులర్, బాక్‌లాగ్ పరీక్షలు గత సంవత్సరం డిసెంబర్, జనవరి మధ్యలో నిర్వహించగా దాదాపు రెండు నెలలు గడుస్తున్నా ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సకాలంలో ఫలితాలను విడుదల చేయాలని కోరారు.
News March 16, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 18 గంటల సమయం

AP: తిరుమలలో శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 82,580 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,905 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.