News March 18, 2025
తిరుపతి జిల్లాలో మైక్రో ఇరిగేషన్ సాగు ఎంతంటే?

తిరుపతి జిల్లాలో మైక్రో ఇరిగేషన్ అమలు, పురోగతి, లబ్ధిదారుల వివరాలు, సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత ప్రోత్సాహం గురించి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంట్లో మంగళవారం ప్రశ్నించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం 2015-16 నుంచి అమలులో ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 96.97 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మైక్రో-ఇరిగేషన్ చేపట్టారని తెలిపారు.
Similar News
News October 24, 2025
పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్లాగ్ ఫలితాల విడుదల

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్) తదితర కోర్సుల 2000-19 మధ్య బ్యాచ్ల విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఫలితాలు సిద్ధంగా ఉన్నాయని, విద్యార్థులు తమ మార్కు మెమోలను ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచిలోని పీజీ సెక్షన్ (రూం నంబర్.13) నుంచి తీసుకోవచ్చని సూచించారు.
News October 24, 2025
ప్రజలకు సమర్థవంతమైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

నవంబర్ 1 నుంచి 7 వరకు జరగనున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం రేగళ్ల, చాతకొండ ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. ఎన్హెచ్ఎం బృందం రానున్నందున ముందస్తు ఏర్పాట్లను, కేంద్రాల స్థితిగతులను పరిశీలించారు. ప్రజలకు సకాలంలో, సమర్థవంతమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News October 24, 2025
విజయనగరంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం

SC కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 15 మంది యువతకు 45 రోజుల ఉచిత హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నేడు ప్రారంభమైంది. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శిక్షణా బస్సుకు JC సేతు మాధవన్ జెండా ఊపి ప్రారంభించారు. వీటి అగ్రహారం RTC శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో SC కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


