News March 18, 2025
తిరుపతి జిల్లాలో మైక్రో ఇరిగేషన్ సాగు ఎంతంటే?

తిరుపతి జిల్లాలో మైక్రో ఇరిగేషన్ అమలు, పురోగతి, లబ్ధిదారుల వివరాలు, సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత ప్రోత్సాహం గురించి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంట్‌లో మంగళవారం ప్రశ్నించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం 2015-16 నుంచి అమలులో ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 96.97 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మైక్రో-ఇరిగేషన్ చేపట్టారని తెలిపారు.
Similar News
News April 20, 2025
వారికి పెన్షన్ పునరుద్ధరణ?

TG: రాష్ట్రంలో గత ఐదేళ్లలో 2.24లక్షల మంది పెన్షన్‌దారులు సొంతూళ్ల నుంచి వలస వెళ్లినట్లు సెర్ప్ గుర్తించింది. వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోకపోతే అధికారులు జాబితా నుంచి పేరు తొలగిస్తున్నారు. అలాంటి వారు సొంతూరుకు వస్తే పెన్షన్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 పెన్షన్ అందుతోంది.
News April 20, 2025
కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుల అరెస్ట్

మంగళగిరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మున్నా ఫరూక్ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సిరివెళ్ల సీఐ దస్తగిరి బాబు, ఎస్సై చిన్నపీరయ్య తెలిపారు. నంద్యాలకు చెందిన షేక్ షబ్బీర్ బాషా ప్రియురాలిపై కానిస్టేబుల్ ఫరూక్ అసభ్యంగా ప్రవర్తించాడన్న కోపంతో హత్య చేశారని తెలిపారు. మృతదేహాన్ని గిద్దలూరు అటవీ ప్రాంతంలో పడేశారని వివరించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
News April 20, 2025
VZM: రౌడీ షీటర్లకు ఎస్పీ హెచ్చరిక

రౌడీ షీటర్లు సన్మార్గంలో జీవించకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని SP వకుల్ జిందల్ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తమ సిబ్బంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. రౌడీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన, వారు నిర్వర్తించే పనులు, ప్రస్తుత వారి జీవన విధానం పట్ల నిఘా పెట్టాలని ఆదేశించారు. B,C షీట్లు కలిగిన వ్యక్తులకు లేటెస్ట్ ఫోటోలు తీయాలన్నారు.