News February 18, 2025

తిరుపతి జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

తిరుపతి జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <>లింకుపై<<>> క్లిక్ చేసి మీ పేరు, మండలం పేరు, పనిచేసిన సంస్థ పేరు నమోదు చేయండి.

Similar News

News April 10, 2026

హనుమకొండ: భార్యపై భర్త కత్తితో దాడి

image

జిల్లాలోని ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి శివారులో దంపతుల మధ్య వివాదం దాడికి దారితీసింది. వరంగల్ డాక్టర్ కాలనీకి చెందిన కట్కూరి స్వప్న-రాజు మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, భర్త రాజు కత్తితో దాడి చేయడంతో స్వప్న గాయపడింది. ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

News April 10, 2026

నాగార్జునసాగర్ విజయ విహార్‌కు 63 వసంతాలు పూర్తి

image

ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ హిల్ కాలనీలో కృష్ణానది తీరంలో ఉన్న విజయ విహార్ అతిథి గృహం నేటితో 63 వసంతాలు పూర్తి చేసుకుంది. 1963 ఏప్రిల్ 10న సేవలు ప్రారంభమైన ఈ గెస్ట్ హౌస్‌ను నాటి సీఎం నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు వచ్చిన వీవీఐపీల కోసం ఎన్ఎస్పీ నిర్మించింది. ప్రస్తుతం పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్న ఈ అతిథి గృహంలో 35 గదులు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి.

News April 10, 2026

ఇంట్లో నోట్ల కట్టలు.. జస్టిస్ వర్మ రాజీనామా

image

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రిజైన్ లెటర్‌ను పంపారు. గతేడాది ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో భారీగా <<17379382>>డబ్బు కట్టలు<<>> బయట పడిన విషయం తెలిసిందే.