News October 16, 2024
తిరుపతి జిల్లాలో రేపు సెలవు
తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇవాళ జిల్లాకు రెడ్ జోన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీంతో కలెక్టర్ వేంకటేశ్వర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు గురువారం సెలవు ప్రకటించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. అన్నమయ్య జిల్లాలో సెలవుపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
Similar News
News November 3, 2024
తిరుమలలో భారీ రద్దీ.. భక్తుల అవస్థలు
తిరుమల శ్రీవారి దర్శనానికి నేడు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతోపాటు దీపావళి సెలవులు ముగియడంతో పెద్ద ఎత్తున కొండ మీదకి తరలి వెళ్లారు. దీంతో ప్రధాన కంపార్ట్‌మెంట్లన్నీ నిండి భారీగా క్యూ లైన్ ఏర్పడింది. సుమారు ఆరు గంటల నుంచి ఆహారంతోపాటు నీటి సదుపాయం కూడా లేదని పలువురు చిన్న పిల్లల తల్లులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ సిబ్బంది స్పందించాలని వారు కోరారు.
News November 3, 2024
తిరుచానూరులో తీవ్ర విషాదం
తిరుపతి జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. తిరుచానూరు పరిధిలోని శిల్పారామంలో క్రాస్ వీల్(జాయింట్ వీల్ లాంటింది)లో ఇద్దరు మహిళలు కూర్చొని తిరుగుతుండగా ఒక్కసారిగా అందులోని ఓ బాక్స్ ఊడిపోయింది. దీంతో ఓ మహిళ మృతిచెందింది. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 3, 2024
6న టీటీడీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం..?
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి 29 మందితో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 6వ తేదీన టీటీడీ ఛైర్మన్‌గా బిఆర్ నాయుడు సహా పలువురు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. టీటీడీ అధికారులు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఎవరెవరు వస్తారు, ఏ రోజు వస్తారు అనేది పూర్తి స్థాయిలో వెల్లడించాలని టీటీడీ అధికారులు ఇప్పటికే సభ్యులకు తెలియజేసినట్లు తెలుస్తుంది.