News March 7, 2025
తిరుపతి జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

తిరుపతి జిల్లాలో రేపు(శనివారం) అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 220 కన్నా తక్కువ పని దినాలు ఉండడంవల్ల రేపు పని దినంగా ప్రకటించామన్నారు. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళా టీచర్లు జరుపుకోవాలన్న ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 1, 2025
పాతబస్తీ మెట్రోకు రూ.125 కోట్లు మంజూరు

పాతబస్తీ మెట్రోకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులకు అనుమతులు వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. పాతబస్తీ మెట్రోను మరింత వేగంగా నిర్మించడం కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.
News December 1, 2025
13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షల అడ్మిట్ కార్డులను IBPS విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14 తేదీల్లో ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి. కాగా ప్రస్తుతం ఉచిత మాక్ టెస్టులు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
వెబ్సైట్: https://www.ibps.in/
News December 1, 2025
రెవిన్యూ సమస్యలు పరిష్కరించండి: అల్లూరి కలెక్టర్

గ్రామాల్లో నెలకొన్న రెవిన్యూ సమస్యలు మండల స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ తహశీల్దార్లను ఆదేశించారు. రంపచోడవరంలో చింతూరు, రంపచోడవరం డివిజన్ల రెవిన్యూ అధికారులతో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ప్రతీ వారం తన వద్దకు 60 సమస్యలు ఈ ప్రాంతం నుంచి వస్తున్నాయని అన్నారు. అన్నిటిని ఇక్కడే పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలన్నారు.


