News March 7, 2025

తిరుపతి జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

image

తిరుపతి జిల్లాలో రేపు(శనివారం) అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 220 కన్నా తక్కువ పని దినాలు ఉండడంవల్ల రేపు పని దినంగా ప్రకటించామన్నారు. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళా టీచర్లు జరుపుకోవాలన్న ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 16, 2026

నరసరావుపేట: నేడు కలెక్టరేట్లో PGRS

image

జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.

News February 16, 2026

కడప: ఇవాళే లాస్ట్.. అప్లై చేశారా?

image

కడప డివిజన్ పరిధిలోని సావిశెట్టిపల్లి, వెంకటరెడ్డి పల్లితో పాటు 26 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని దొరసాని పల్లి, సిరిగే పల్లి, సుద్ధపల్లె తదితర గ్రామాల్లో 32 పోస్టులను భర్తీ చేస్తారు. జీతం రూ.12 వేల నుంచి రూ.24,470. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 16, 2026

సంగారెడ్డి: మంజీర నదిలో వ్యక్తి గల్లంతు

image

మంజీర నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. HYD రాజేంద్రనగర్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్ ఆదివారం స్నేహితుడితో కలిసి శివంపేట సమీపంలో నదిలో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఘటనపై సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమద్ కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ఆచూకీ లభించలేదు.