News February 1, 2025
తిరుపతి జిల్లాలో 130 క్లస్టర్ల ఏర్పాటు: కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా పర్యవేక్షణ పెంచేందుకు క్లస్టర్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నామని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. నూతనంగా తీసుకొచ్చిన క్లస్టర్ విధానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అమలు అయ్యేలా చూడాలని తెలిపారు. జిల్లాలో 130 క్లస్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Similar News
News December 1, 2025
డ్రామాపైనే మోదీ దృష్టి: ఖర్గే

ముఖ్యమైన అంశాలపై చర్చించడం కంటే డ్రామాపై ప్రధాని మోదీ ఎక్కువ దృష్టి పెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. గత 11 ఏళ్లుగా ప్రభుత్వం పార్లమెంటరీ మర్యాదను దెబ్బతీస్తోందని ఆరోపించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కనీసం చర్చించకుండా 15 నిమిషాల్లోనే కొన్ని బిల్లులు పాస్ చేసిందని విమర్శించారు. సాగు చట్టాలు, జీఎస్టీ సవరణలు, సీఏఏపై తగిన చర్చ లేకుండా పార్లమెంటును బుల్డోజ్ చేసిందన్నారు.
News December 1, 2025
అనంతపురంలో రోడ్డెక్కిన అరటి రైతులు

అనంతపురం కలెక్టరేట్ వద్ద అరటి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన అరటి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అరటి రైతులు రోడ్డెక్కి ఆర్తనాదాలు చేస్తుంటే కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తక్షణమే అరటి రైతులను ఆదుకోకపోతే కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని శైలజానాథ్ హెచ్చరించారు.
News December 1, 2025
తిరుపతి జిల్లా ప్రైవేట్ స్కూల్లో భారీ మోసం

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే నామినల్ రోల్స్ ప్రక్రియ కొనసాగుతుండగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దోపిడీకి తెరలేపాయి. జిల్లాలో 271 ప్రైవేట్ స్కూల్స్ ఉండగా.. 12,796 మంది పది పరీక్షలు రాయనున్నారు. పదో తరగతి పరీక్ష ఫీజు రూ.125 వసూలు చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ చాలా స్కూల్లో రూ.1000 తీసుకుంటున్నారు. అధికారులకు తెలిసే ఇదంతా జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. మీరు ఎంత కట్టారో కామెంట్ చేయండి.


