News March 1, 2025

తిరుపతి జిల్లాలో 92.42 శాతం ఫించన్ పంపిణీ  పూర్తి 

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ జిల్లావ్యాప్తంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12.40 వరకు జిల్లాలో 92.42 శాతం పంపిణీ పూర్తి అయినట్లు  అధికారులు వెల్లడించారు. యర్రావారిపాలెం 95.15 శాతంతో ముందు స్థానంలో ఉండగా పిచ్చాటూరు 88.64 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. సాయంత్రానికి 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.

Similar News

News December 3, 2025

కరీంనగర్: ఒత్తిళ్లకు ‘నై’.. సమరానికి ‘సై’..!

image

కరీంనగర్(R) మండలం నగునూర్‌కు చెందిన మెతుకు హేమలత పటేల్ దశాబ్దకాలంగా కరీంనగర్ కోర్టులో అడ్వకేట్‌గా సేవలందిస్తున్నారు. MA, LLB చదివిన ఈమె న్యాయవాద వృత్తితోపాటు మహిళలు, పిల్లలకు మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థిగానూ పోటీ చేసిన హేమలత.. ఇప్పుడు నగునూర్ సర్పంచ్‌గా బరిలోకి దిగారు. పోటీ నుంచి తప్పుకోవాలని వస్తున్న ఒత్తిళ్లను సైతం ఆమె లెక్కచేయకుండా సమరానికి సై అంటున్నారు.

News December 3, 2025

4న మన్యంలో మంత్రి లోకేశ్ పర్యటన

image

మంత్రి నారా లోకేశ్ ఈనెల 4న భామిని మండలంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో రాత్రి 7 గంటలకు భామిని చేరుకోనున్నారు. 7 నుంచి 9 గంటల వరకు భామినిలో టీడీపీ కార్యకర్తలతో ముఖా ముఖిలో పాల్గొంటారు. ఆ రోజు రాత్రి బస చేసి మరుసటి రోజు స్థానిక ఆదర్శ పాఠశాలలో మెగా పేరెంట్&టీచర్స్‌ మీటింగ్‌లో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొంటారు.

News December 3, 2025

49 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్& ఎంపవర్‌మెంట్‌‌లో 49 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. NIRF ర్యాంక్ పొందిన టాప్ 100 ఇన్‌స్టిట్యూట్‌లో డిగ్రీ 60% మార్కులతో ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://socialjustice.gov.in