News April 2, 2024
తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీశా బదిలీ

తిరుపతి జిల్లా ఎన్నికల ప్రధాన అధికారి, కలెక్టర్ లక్ష్మీశాను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ప్రతిపక్ష పార్టీల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా వారిలో కలెక్టర్ లక్ష్మీశా ఉన్నారు. అదేవిధంగా చిత్తూరు ఎస్పీ జాషువాను కూడా బదిలీ చేశారు.
Similar News
News April 22, 2025
చిత్తూరు : ఇంటర్ డీఐఈఓగా శ్రీనివాసులు

చిత్తూరుజిల్లా ఇంటర్మీడియట్ డీఐఈఓగా ఏ. శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలో డీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులును చిత్తూరు డీఐఈఓగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో చిత్తూరు డీఐఈఓగా పనిచేస్తున్న మౌలా తన పూర్వపు స్థానం కణ్ణన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా కొనసాగనున్నారు.
News April 22, 2025
చిత్తూరు జిల్లాలో అలా చేస్తే జైలుశిక్ష

మామిడి కాయలను మగ్గించడానికి కాల్షియం కార్బైడ్ అమ్మడం, నిల్వ చేయడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని చిత్తూరు జేసీ విధ్యాధరి హెచ్చరించారు. ఎక్కడైనా తనిఖీల్లో కాల్షియం కార్బైడ్ పట్టుబడితే సెక్షన్ 44(ఏ) ప్రకారం 3 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తామని చెప్పారు. ఎథిలీన్ గ్యాస్, ఎత్రెల్ ద్రావణాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు.
News April 22, 2025
మాట నిలబెట్టుకున్న సీఎం: చిత్తూరు ఎంపీ

సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసి మాట నిలబెట్టుకున్నారని చిత్తూరు ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ డీఎస్సీ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.