News January 30, 2025
తిరుపతి జిల్లా టీచర్లకు DEO గమనిక

తిరుపతి జిల్లాలోని HMలు, ఉపాధ్యాయులకు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం(TIS) వివరాల నమోదుకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లు DEO KVN.కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎడిట్ ఆప్షన్ను 31వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. వచ్చే బదిలీలు, పదోన్నతులు ఎడిట్ ఆప్షన్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు. సవరణ చేయకపోతే మరోసారి అవకాశం లేదన్నారు.
Similar News
News December 5, 2025
కేంద్ర మంత్రి గడ్కరీకి ఎంపీ మహేష్ కుమార్ రిక్వెస్ట్

ఏలూరు-జంగారెడ్డిగూడెం రాష్ట్ర ప్రధాన రహదారిని జాతీయ ప్రధాన రహదారిగా గుర్తించి అభివృద్ధి చేయాలని ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గురువారం ఢిల్లీలో ఆయనను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ రహదారిపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులు, ఇతర వస్తువుల రవాణా భారీగా జరుగుతుంటుందని ఎంపీ తెలిపారు.
News December 5, 2025
గోదావరి డెల్టాలో నీటి కొరత.. రబీ సాగు కష్టమే

గోదావరి డెల్టా ఆయకట్టులో ఈ ఏడాది రబీలో సాగునీటి కష్టాలు తప్పేటట్లు లేవని గోదావరి హెడ్ వర్క్స్ ఎస్ఈ కే. గోపీనాథ్ తెలిపారు. సాగు, తాగు, పరిశ్రమలకు కలిపి మొత్తం 93.26 టీఎంసీల నీరు అవసరం కాగా, ప్రస్తుతం 73.36 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొన్నారు. నదిలో సహజ జలాలు (9.45 టీఎంసీ), పోలవరం(20 టీఎంసీ), సీలేరు నుంచి (43.91 టీఎంసీ) అందుబాటులో ఉన్నా.. 19.90 టీఎంసీల నీటి కొరత ఏర్పడిందన్నారు.
News December 5, 2025
యూరియాకు ఇవి ప్రత్యామ్నాయం

యూరియా కొరతను అధిగమించేలా ప్రస్తుతం మార్కెట్లో పంటపై పిచికారీ చేసే అనేక ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. నానో యూరియా, నానో DAP, నీటిలో కలిపి పిచికారీ చేసే 19:19:19, 20:20:20, కాంప్లెక్స్ ఎరువులు, అధిక సాంద్రత కలిగిన 13-0-45(HD), ద్రవరూప నత్రజని ఎరువు వంటివి అందుబాటులో ఉన్నాయి. దుక్కిలో సిఫారసుల మేరకు కాంప్లెక్స్ ఎరువులను వేసుకొని, పైరుపై పిచికారీ చేసే ఎరువులను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.


