News March 19, 2025
తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

తిరుపతి కలెక్టరేట్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే జరుగుతుంది. వచ్చే సోమవారం నుంచి గ్రీవెన్స్ డే సమయాన్ని మార్చారు. ఈనెల 24వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఈ విషయాన్ని తిరుపతి జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టరేట్ అధికారులు కోరారు.
Similar News
News November 14, 2025
గోపీనాథ్ ‘లీడ్ బ్రేక్’ చేసిన నవీన్

జూబ్లీహిల్స్‌లో అంచనాలకు మించి నవీన్ యాదవ్ దూసుకెళ్తున్నారు. ఆయనకు 10 వేలకు అటు ఇటుగా మెజార్టీ రావచ్చని మెజార్టీ సర్వేలు చెప్పాయి. అయితే 9వ రౌండ్ ముగిసేసరికే 19వేల ఆధిక్యంలో ఉన్నారు. ఈ సెగ్మెంట్లో దివంగత MLA మాగంటి గోపీనాథ్ 2014లో 9,242, 2018లో 16,004, 2023లో 16,337 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సెగ్మెంట్లో అత్యధిక మెజార్టీ రికార్డ్ విష్ణు (2009లో కాంగ్రెస్ నుంచి 21,741 లీడ్) పేరిట ఉంది.
News November 14, 2025
AcSIRలో 16 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

అకాడమీ ఆఫ్ సైంటిఫిక్& ఇన్నోవేటివ్ రీసెర్చ్(<
News November 14, 2025
కృష్ణా: రేపటి నుంచి మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ

మహిళలకు రేపటి నుంచి స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు నైపుణ్యాభివృద్ధి మహిళా సాధికారత కేంద్రం జిల్లా మేనేజర్ ఎస్. జుబేదా పర్వీన్ శుక్రవారం తెలిపారు. పామర్రు (M) నిమ్మకూరు ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రంలో 18-35 వయసు కలిగిన మహిళలకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ బ్యూటీ తెరపిస్ట్, జనరల్ డ్యూటీ నర్సింగ్ అసిస్టెంట్, మగ్గం వర్క్‌లలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.


