News November 27, 2024
తిరుపతి జిల్లా ప్రజలకు SP గమనిక

ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు పోలీసు వారి సూచనలను పాటించాలని SP సుబ్బరాయుడు తెలిపారు. సురక్షితంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం డయల్ 112/80999 99977నంబర్‌కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పోలీసులు తక్షణ సహాయక చర్యలు అందిస్తారని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.
Similar News
News December 9, 2025
చిత్తూరు: ముగిసిన పులుల గణన

జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో పులుల గణన సోమవారం ముగిసింది. 4.87 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతంలో చిత్తూరు ఈస్టు, వెస్టు, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం రేంజ్‌కు ఉన్నాయి. వీటి పరిధిలో 24 సెక్షన్లు, 84 బీట్ల సిబ్బంది గణన ప్రక్రియలో పాల్గొన్నారు. నాలుగేళ్లకోసారి ఈ గణనను అధికారులు నిర్వహిస్తున్నారు.
News December 9, 2025
చిత్తూరు జిల్లాలో మరో ఇద్దరికి స్క్రబ్ టైఫస్

చిత్తూరు జిల్లాలో సోమవారం మరో రెండు స్క్రబ్ టైఫస్ కేసులు బయట పడ్డాయి. జీడీనెల్లూరు మండలంలోని ముత్తుకూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, తవణంపల్లి మండలం పల్లెచెరువు గ్రామానికి చెందిన మరో వ్యక్తి స్క్రబ్ టైఫస్‌తో బాధపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాధితులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
News December 9, 2025
చిత్తూరు పోలీసులకు 46 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 46 ఫిర్యాదుల అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 8, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 7 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.


