News November 27, 2024

తిరుపతి జిల్లా ప్రజలకు SP గమనిక

image

ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు పోలీసు వారి సూచనలను పాటించాలని SP సుబ్బరాయుడు తెలిపారు. సురక్షితంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం డయల్ 112/80999 99977నంబర్‌కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పోలీసులు తక్షణ సహాయక చర్యలు అందిస్తారని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.

Similar News

News July 11, 2025

చిత్తూరు: వర్షాలు లేక తగ్గిన ఖరీఫ్ పంటల సాగు

image

ఉ.చిత్తూరు జిల్లా రైతులు ఎక్కువగా వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. కొన్ని మండలాల్లో వర్షాల కారణంగా సాగు ప్రారంభించారు. గతేడాదితో పోల్చితే వేరుశనగ, వరి సాగు 50 శాతం మాత్రమే ఉందని సమాచారం. వరిని రైతులు 11వేల హెక్టార్లకు 4వేల హెక్టార్లలో సాగు ప్రారంభించారు. వేరుశనగ 36 వేల హెక్టార్లకుగాను సుమారు 1,000 పైగా హెక్టార్లలో సాగు ప్రారంభమైంది. త్వరలో వర్షం లేకపోతే సాగు కష్టమే అంటున్నారు రైతులు.

News July 11, 2025

త్వరలోనే TDP ఉనికి గల్లంతు: పెద్దిరెడ్డి

image

వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

News July 11, 2025

కుప్పం రైతులకు రూ.25.90 కోట్ల నష్టపరిహారం

image

కుప్పం ఎయిర్పోర్ట్ కోసం 2018లో భూములు ఇచ్చిన రైతులకు వడ్డీతో కలిపి ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. పలువురు రైతులకు కడ పీడీ వికాస్ మర్మత్, MLC శ్రీకాంత్, RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం, RDO శ్రీనివాసరాజు గురువారం రూ.25.90 కోట్ల చెక్కులను అందజేశారు. మండలాల వారీగా రైతులకు నష్టపరిహారం అందివ్వడం జరుగుతుందని MLC తెలిపారు. భూ సేకరణకు రైతులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.