News August 20, 2024
తిరుపతి జిల్లా హోంగార్డుల సంక్షేమానికి పెద్దపీట
తిరుపతి జిల్లా పోలీసు శాఖ హోంగార్డుల సంక్షేమం కోసం పాటుపడుతుందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా 7 మంది హోంగార్డులకు చెక్కులు అందజేశారు. ఇటీవల అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చుల నిమిత్తం వారు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి నిమిత్తం ఒక్కొక్కరికి రూ.4,999ల చొప్పున వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉన్నారు.
Similar News
News September 18, 2024
నెల్లూరు: చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి
సంగం మండలం పడమటి పాలెంలో మంగళవారం అప్పుల బాధ తట్టుకోలేక ఏఎస్ పేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం కానిస్టేబుల్ రమేశ్ మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబ సభ్యులు తెలిపారు.
News September 18, 2024
సంగం: కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ఏఎస్ పేటలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేశ్ సంగం మండలం పడమటిపాలెంలో మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నానికి వ్యవసాయంలో వచ్చిన నష్టాలు, ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బుచ్చి నుంచి నెల్లూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమేశ్ స్వగ్రామం విడవలూరు.
News September 18, 2024
నెల్లూరు: నవోదయ ప్రవేశపరీక్షకు దరఖాస్తుల గడువు పెంపు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 23వ తేదీ వరకు పొడిగించినట్లు నవోదయ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలోని 5వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలు, సూచనలు, సలహాలు కొరకు 08985007588, 63004 29938 నంబర్లను సంప్రదించాలని కోరారు.