News February 6, 2025
తిరుపతి: టీచర్‌పై పోక్సో కేసు

నారాయణవనంలో టీచర్‌పై పోక్సో కేసు నమోదైంది. వెంకటరమణ నారాయణవనం(M), ఎరికంబట్టులోని పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన మిట్టనైనారు కండ్రికకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. అక్కడ నలుగురు విద్యార్థునుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారు తల్లిదండ్రులకు వెళ్లి చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజశేఖర్ పేర్కొన్నారు.
Similar News
News January 11, 2026
కరీంనగర్: బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే బదిలీ

కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు చేపట్టిన రఫీక్ ఖాన్ రెండు రోజులకే బదిలీ అయ్యారు. జగిత్యాల వీఆర్ నుంచి ఇక్కడికి వచ్చిన ఆయనను ఉన్నతాధికారులు సీసీఆర్‌బీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయనపై ఉన్న పలు ఆరోపణల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది. బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే బదిలీ కావడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
News January 11, 2026
ఆవు పాలకు ఉన్న ప్రత్యేకతలు ఇవే..

ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాల కంటే తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి సులువుగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే ప్రోటీన్స్ కండరాలను బలోపేతం చేస్తాయి. ఆవు పాలలో అధిక కాల్షియం, విటమిన్ డి ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. గుండె జబ్బులు ఉన్నా, బాగా లావుగా ఉన్నా, జీర్ణ సమస్యలు ఉంటే ఆవు పాలను తాగడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులకు ఆవు పాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
News January 11, 2026
బీపీ నార్మల్ అవ్వాలంటే ఇలా చెయ్యాలి

మారిన జీవనశైలితో ప్రస్తుతకాలంలో చిన్నవయసులోనే చాలామంది బీపీతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ముందు నుంచే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఉప్పు ఎక్కువగా వాడకుండా మసాలాలు, హెర్బ్స్ వాడాలి. ఎత్తుకు తగిన బరువుండేలా చూసుకోవాలి. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. స్మోకింగ్ మానేయాలి. ప్రాసెస్డ్, ఫ్రైడ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. అల్లాన్ని ఎక్కువగా వంటల్లో తీసుకోవాలి.


