News February 12, 2025

తిరుపతి: టెన్త్ అర్హతతో 99 ఉద్యోగాలు

image

టెన్త్ అర్హతతో తిరుపతి డివిజన్‌లో 59, గూడూరు డివిజన్‌లో 40 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీ వరకు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News December 5, 2025

ANU: ఎం ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత ఆగస్టు నెలలో జరిగిన ఎం ఫార్మసీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు శుక్రవారం విడుదల చేశారు. ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ
ఫలితాలలో 83.78%, సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలలో 84.77% ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మార్కుల రీకౌంటింగ్ కొరకు ఈనెల 15వ తేదీ లోపు రూ.2,190 నగదు చెల్లించాలన్నారు.

News December 5, 2025

ఈ రోజుల్లో సాధారణ భక్తులకు దర్శనాలుండవు: TTD

image

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈనెల 30,31, జనవరి 1వ తేదీల్లో సర్వ దర్శనం, స్పెషల్ ఎంట్రీ, శ్రీవాణి వంటి దర్శనాలు పూర్తిగా రద్దయ్యాయి. ఈ మూడు రోజులు ఈ-డిప్‌లో టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలుంటాయి. సాధారణ భక్తులు ఈ మూడు రోజుల్లో దర్శనాలకు వచ్చి ఇబ్బంది పడొద్దని టీటీడీ సూచించింది. 2026, జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సాధారణ భక్తులూ వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చని తెలిపింది. share it

News December 5, 2025

చింతపల్లి: స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు మంజూరు

image

స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు. గురువారం పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో, చింతపల్లి మండలానికి చెందిన 27 స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ద్వారా మంజూరైన రూ.3కోట్ల 15లక్షల రుణాలు చెక్కును కలెక్టర్ పంపిణీ చేశారు. రుణాలు సద్వినియోగం చేసుకుని, మహిళలు ఆర్ధికాభివృద్ది సాధించాలన్నారు.