News August 20, 2024

తిరుపతి: డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పసల పొన్నారావు

image

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి(M) VM పల్లి గ్రామానికి చెందిన పసల మహాలక్ష్మమ్మ, మోహన్‌రావుల కుమారుడు పొన్నారావు డిప్యూటీ సొలిసిటర్ జనరల్(DSG)గా నియమితులయ్యారు. హైకోర్టులో కేంద్రప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తారు. ఈ మేరకు కేంద్రన్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పొన్నారావు మూడేళ్లపాటు ఈపదవిలో కొనసాగుతారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి DSGగా నియమితులవడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.

Similar News

News September 18, 2024

తిరుపతి: 108లో ఉద్యోగ అవకాశాలు

image

108 వాహనాల్లో ఫైలట్ (డ్రైవర్), ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి 108 సర్వీస్ జిల్లా మేనేజర్ సంజీవ రెడ్డి తెలిపారు. ఫైలెట్ పోస్టులకు పదవ తరగతి ఉత్తీర్ణత, హెవీ డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. వివరాలకు తిరుపతి మధురానగర్ లోని 108 సర్వీసెస్ జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News September 18, 2024

తిరుమల: 21న వర్చువల్ సేవల కోటా విడుదల

image

తిరుమలలో వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. డిసెంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను సెప్టెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల ఆన్ లైన్ కోటాను సెప్టెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

News September 17, 2024

18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్‌లో కోటా విడుదల

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబరు నెల కోటాను సెప్టెంబరు 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబరు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబరు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.