News June 27, 2024
తిరుపతి: డెంటల్ డాక్టర్కు 6 నెలల జైలు శిక్ష

తిరుపతికి చెందిన ఎం.మౌనిక దగ్గర ఎం.ఆర్.పల్లికి చెందిన డెంటల్ డాక్టర్ పవిత్ర తన ‘సిరి డెంటల్ కేర్’ అభివృద్ధి కోసం ఏప్రిల్ 15, 2019న రూ.5 లక్షలు అప్పుగా తీసుకుంది. తీసుకున్న డబ్బుకు పవిత్ర చెక్ ఇవ్వగా బ్యాంకులో డబ్బు లేకపోవడంతో మౌనిక కోర్టును ఆశ్రయించారు. నేరం రుజువు కావడంతో తిరుపతి 2వ కోర్టు పవిత్రకు 6 నెలలు జైలు శిక్ష రూ.5 వేలు ఫైన్ ను గురువారం ఖరారు చేసింది.
Similar News
News October 16, 2025
CTR: 23 నుంచి స్కూల్లో ఆధార్ క్యాంపులు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశింది. ఈ మేరకు చిత్తూరు జిల్లాలో ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు గుర్తించిన స్కూల్లో ఆధార్ కార్డు శిబిరాలు నిర్వహిస్తామని డీఈవో వరలక్ష్మి ప్రకటించారు. విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ చేస్తామని చెప్పారు. మార్పులు, చేర్పులు సైతం చేసుకోవచ్చన్నారు.
News October 15, 2025
గూగుల్ రాకపై చిత్తూరు MP ఏమన్నారంటే..?

విశాఖలో గూగుల్ ఏర్పాటుతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు అన్నారు. నూతన ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు ముందుంటారని కొనియాడారు. వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. ఏపీ, గూగుల్ మధ్య ఒప్పందం చారిత్రాత్మకమని చెప్పారు. ఈ ఒప్పందంతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందన్నారు.
News October 15, 2025
తిరుపతిలో వైసీపీ నాయకుల నిరసన

సోషియల్ మీడియాలో ప్రశ్నించారని వైసీపీ నాయకులను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు కూటమి ప్రభుత్వానికి వత్తాసుగా నిలుస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు.