News March 9, 2025
తిరుపతి: తుడా టవర్స్ వేలాన్ని పరిశీలించిన కమిషనర్

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం తుడా టవర్స్ వేలంను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కమిషనర్ మౌర్య పరిశీలించారు. ఎక్కడ ఇబ్బందులు లేకుండా వేలంపాట నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 8, 2026
విశాఖలో మోడ్రన్ కియోస్కులు..

విశాఖ వీధులకు సరికొత్త అందాన్ని తెచ్చేలా నెల్లూరు తరహాలో జీవీఎంసీ ‘స్మార్ట్ వెండింగ్ జోన్ల’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సెంట్రల్ పార్క్, ఎండాడ, దువ్వాడలలో అత్యాధునిక మాడ్యులర్ కియోస్కులను నిర్మించనున్నారు. వీటికి సోలార్ పవర్, డిజిటల్ పేమెంట్స్, సీసీటీవీ నిఘా వంటి సౌకర్యాలు ఉంటాయి. వీధి వ్యాపారులకు శాశ్వత చిరునామాను కల్పిస్తూ, ట్రాఫిక్ ఇబ్బందులు లేని నగరంగా తీర్చి దిద్దడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.
News February 8, 2026
KMR: అప్పుడు భర్తలు.. ఇప్పుడు భార్యలు

కామారెడ్డి పురపాలికలో గతంలో భర్తలు పోటీచేస్తే ప్రస్తుతఎన్నికల్లో భార్యలు పోటీ చేస్తున్నారు. 11వ వార్డులో గతంలో కాసర్ల శ్రీనివాస్ పోటీ చేయగా ప్రస్తుతం ఆయన భార్య కాసర్లరాణి బరిలో నిలిచారు. 14వ వార్డులో గతంలో మాసుల లక్ష్మీనారాయణ, ప్రస్తుతం ఆయన భార్య మాసుల అంజలి, 35వ వార్డులో గతంలో పోలీసు కృష్ణాజిరావు, ప్రస్తుతం ఆయన భార్య పోలీసు సంపూర్ణ బరిలో ఉన్నారు. భర్తలు గతంలో గెలిచారు, భార్యలు ఇప్పుడు గెలుస్తారా?
News February 8, 2026
ఎమ్మెల్యే పిలుపుతో బడిబాగు ఉద్యమం

MLA అమిలినేని సురేంద్రబాబు పిలుపు మేరకు బడి బాగు కోసం పూర్వ విద్యార్థులు నడుంబిగించారు. శెట్టూరు మండలంలోని మాకొడికి పాఠశాల బాగు కోసం జగన్నాథ్ నాయక్ రూ.2లక్షల విరాళం అందించారు. కానిస్టేబుల్ షేక్ ఖాసీంసా, HM తిప్పేస్వామి దంపతులు తమ నెల జీతాన్ని విరాళంగా ఇచ్చి ఉదారత చాటారు. దాతల సాయంపై హర్షం వ్యక్తమవుతోంది. ఉన్నతంగా స్థిరపడిన వారు ఇలా చొరవ చూపితే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి.


