News January 9, 2025

తిరుపతి తొక్కిసలాటపై మంత్రి దామోదర దిగ్ర్భాంతి

image

తిరుపతి తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందడంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటలో గాయపడి, చికిత్స పొందుతున్న భక్తులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి ఆయన విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 10, 2025

మెదక్: మోడల్ స్కూల్లో ప్రవేశాలు.. మిస్ చేసుకోకండి

image

తెలంగాణ మోడల్ స్కూల్‌లో 2025-26 ఏడాదిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి10వ ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవాలి. APRIL 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఝరాసంగం మోడల్ స్కూల్‌ ప్రిన్సిపల్ తేనావతి తెలిపారు.

News January 10, 2025

మెదక్: చనిపోయిన 5 నెలల తర్వాత పోస్టుమార్టం

image

రామాయంపేట మం. సుతారిపల్లికి చెందిన లక్ష్మి(48) మృతదేహానికి 5నెలల తర్వాత పోస్టుమార్టం నిర్వహించారు. లక్ష్మి చికిత్స పొందుతూ గతేడాది సెప్టెంబర్‌లో చనిపోగా అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన తల్లి చికిత్స చేస్తుండగానే చనిపోగా వైద్యులు ఆ విషయం చెప్పకుండా డబ్బులు తీసుకున్నాకే మృతిచెందినట్లు చెప్పారని ఆమె కుమార్తె HYDలో ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.

News January 9, 2025

మెదక్: గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

ఈనెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వేడుకలకు సంబంధించిన వేదికను తగిన శ్రద్ధతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సురక్షితమైన వాతావరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు చర్యలు చెప్పటాలని కలెక్టర్ సూచించారు.