News January 18, 2025

తిరుపతి తొక్కిసలాట పిటిషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు

image

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై గవర్నర్ కార్యదర్శి, ముఖ్యమంత్రిని ప్రతివాదులుగా చేర్చుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తొక్కిసలాటకు గవర్నర్ కార్యదర్శి, సీఎం ఎలా బాధ్యులవుతారని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారని.. వెంటనే పిటిషన్‌లో సీఎం, గవర్నర్ కార్యదర్శి పేర్లను తొలగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారం(22వ తేదీ)కి వాయిదా పడింది.

Similar News

News July 11, 2025

త్వరలోనే TDP ఉనికి గల్లంతు: పెద్దిరెడ్డి

image

వచ్చే ఎన్నికల్లో YCP విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని MLA పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఎర్రాతివారిపల్లెలో ‘బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన జీవితంలో మామిడిని రూ.2కే కొనడం ఎప్పుడూ చూడలేదన్నారు. కర్ణాటక కిలో మామిడిని రూ.16 మద్దతు ధరతో భారీగా అమ్ముతుంటే మన పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. త్వరలో TDP ఉనికి గల్లంతవ్వడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

News July 11, 2025

కుప్పం రైతులకు రూ.25.90 కోట్ల నష్టపరిహారం

image

కుప్పం ఎయిర్పోర్ట్ కోసం 2018లో భూములు ఇచ్చిన రైతులకు వడ్డీతో కలిపి ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. పలువురు రైతులకు కడ పీడీ వికాస్ మర్మత్, MLC శ్రీకాంత్, RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం, RDO శ్రీనివాసరాజు గురువారం రూ.25.90 కోట్ల చెక్కులను అందజేశారు. మండలాల వారీగా రైతులకు నష్టపరిహారం అందివ్వడం జరుగుతుందని MLC తెలిపారు. భూ సేకరణకు రైతులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

News July 10, 2025

పూతలపట్టు: గోడ కూలి మహిళ మృతి

image

పూతలపట్టు మండలం బందర్లపల్లి గ్రామంలో కూలి మృతి చెందింది. మూర్తిగాను గ్రామానికి చెందిన మల్లిక అనే మహిళ బందర్లపల్లి గ్రామంలో పని చేస్తూ ఉండగా ఆమెపై గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించినట్లు పేర్కొన్నారు.