News April 11, 2025

తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యకు ప్రశంస

image

రాష్ట్రంలో పన్నుల వసూళ్లలో తిరుపతి నగరపాలక సంస్థ మూడో స్థానంలో నిలచింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ అధికారులు కమిషనర్ ఎన్.మౌర్యను అభినందించారు. ఈ మేరకు గురువారం ఆ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని కమిషనర్లకు తిరుపతిలో ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఎన్.మౌర్యను అభినందించారు. 

Similar News

News February 16, 2026

విమానంలో ఇలా పాటలు వింటే అంతే..

image

విమానాల్లో ఇయర్‌ఫోన్స్ వాడకుండా పెద్ద శబ్దంతో పాటలు వినేవారిపై చర్యలు తప్పవని కేంద్రమంత్రి మురళీధర్ మోహోల్ హెచ్చరించారు. ఇలాంటివారిని అన్‌రూలీ ప్యాసెంజర్‌గా ట్రీట్ చేసి విమానం నుంచి దించేయడం/భవిష్యత్తులో ప్రయాణించకుండా బ్యాన్ చేసే ఆస్కారముందన్నారు. 1937 ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ మేరకు అనుమతి లేకుండా ఎయిర్‌పోర్టుల్లో, ఫ్లైట్‌లో ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని లోక్‌సభలో ఓ MP ప్రశ్నకు సమాధానమిచ్చారు.

News February 16, 2026

ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్ సిరి

image

కర్నూలులో నేడు జరగాల్సిన PGRS కార్యక్రమం రద్దయింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంత్రులు, సెక్రటరీలు, అధికారులతో బిల్ గేట్స్ బృందంతో నేడు సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ప్రజలు గమనించాలని అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని విజ్ఞప్తి చేశారు. మండల స్థాయిలో ఎమ్మార్వోలు, ఆర్డీవోలు కూడా వీసీలో పాల్గొంటారని చెప్పారు.

News February 16, 2026

ఉదయగిరి జూనియర్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఉదయగిరి ARR ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణానికి చెందిన జన్నత్ అనే యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన వ్యక్తి ఉదయగిరి ఉపసర్పంచ్ షేక్ ముత్తూజా హుస్సేన్ తమ్ముడుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.