News January 26, 2025
తిరుపతి: నమ్మించి రూ.11 లక్షలు దోచేసిన పంతులమ్మ

తోటి టీచరే కదా అని నమ్మినందుకు ఓ పంతులమ్మ రూ.11లక్షలు కాజేసిన ఘటన తిరుపతిలో జరిగింది. బైరాగిపట్టెడకు చెందిన శిరీషమాధురి, రేణిగుంట రోడ్డులో ఉంటున్న సీమకుమారి ప్రైవేట్ పాఠశాలలో టీచర్లు. శిరీష స్థలం కొనుగోలు చేయాలని చూస్తుండగా సీమకుమారి తమ స్థలాన్ని కొనమని కోరింది. శిరీషకు స్థలం నచ్చడంతో నగదు ఇచ్చింది. అగ్రిమెంట్ సమయంలో డీకేటి పట్టా ఇవ్వడంతో మోసపోయానని గ్రహించిన శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News November 15, 2025
బిక్కనూర్: అనారోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బిక్కనూర్లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ప్రకారం.. బిక్కనూర్కు చెందిన తిరుమల రాజయ్య(75) అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
News November 15, 2025
PDPL: నవంబర్ 19న జాబ్ మేళా నిర్వహణ: రాజశేఖర్

PDPL కలెక్టరేట్లో నవంబర్ 19న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఎం.రాజశేఖర్ తెలిపారు. ప్రైవేట్ ఫెర్టిలైజర్స్లో 67 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్ 60, ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ 4, హెచ్ఆర్ 2, ఆఫీస్ బాయ్ 1 పోస్టులకు అవసరమైన అర్హతలు ఇంటర్, డిగ్రీ, డిప్లమా, అగ్రికల్చర్ బీఎస్సీ, ఎంబీఏ, పదో తరగతి. అభ్యర్థులు 19న ఉదయం 11 గంటలకు సర్టిఫికేట్స్తో హాజరై నమోదు చేసుకోవాలన్నారు.
News November 15, 2025
విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసిన MHBD ఎమ్మెల్యే

సాధారణ ప్రజా ప్రతినిధిలా కాకుండా, సమాజ సేవలో తన వృత్తి విలువలను కలిపి పని చేయడం మానుకోట ఎమ్మెల్యే డా.మురళీ నాయక్ ప్రత్యేకత. వృత్తిరీత్యా డాక్టర్ కావడంతో గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరంలో నేరుగా మెడలో స్టెతస్కోప్ వేసుకుని విద్యార్థులకు స్వయంగా ఆరోగ్య పరీక్షలు చేశారు. ఎమ్మెల్యే పదవి ఉన్నా, సర్వసాధారణ వైద్యునిలా విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు.


