News January 26, 2025
తిరుపతి: నమ్మించి రూ.11 లక్షలు దోచేసిన పంతులమ్మ

తోటి టీచరే కదా అని నమ్మినందుకు ఓ పంతులమ్మ రూ.11లక్షలు కాజేసిన ఘటన తిరుపతిలో జరిగింది. బైరాగిపట్టెడకు చెందిన శిరీషమాధురి, రేణిగుంట రోడ్డులో ఉంటున్న సీమకుమారి ప్రైవేట్ పాఠశాలలో టీచర్లు. శిరీష స్థలం కొనుగోలు చేయాలని చూస్తుండగా సీమకుమారి తమ స్థలాన్ని కొనమని కోరింది. శిరీషకు స్థలం నచ్చడంతో నగదు ఇచ్చింది. అగ్రిమెంట్ సమయంలో డీకేటి పట్టా ఇవ్వడంతో మోసపోయానని గ్రహించిన శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News February 10, 2025
MDK: జిల్లాలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

మెదక్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న గరిష్ఠంగా నర్సాపూర్ మండలంలో 35.5, వెల్దుర్తి 34.1, నిజాంపేట 33.3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News February 10, 2025
SRD: జిల్లాలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

సంగారెడ్డి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న గరిష్ఠంగా అందోల్ 35.1, వట్ పల్లి 35, నిజాంపేట 34.4, జిన్నారం 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News February 10, 2025
సిద్దిపేట: జిల్లాలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

సిద్దిపేట జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న గరిష్ఠంగా తొగుట 35.5, బెజ్జంకి 35.1, కోహెడ 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుడటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.