News January 20, 2025

తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు

image

తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు. ఆయనకు గతంలోనూ తిరుపతి ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులను చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడును బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ను తిరిగి తిరుపతిలోనే ఎర్రచందనం టాస్క్‌పోర్స్ ఎస్పీగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Similar News

News February 13, 2025

చిత్తూరు జిల్లా నేతలకు కీలక పదవులు

image

చిత్తూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా KP. శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే చిత్తూరు రూరల్ అధ్యక్షుడిగా జయపాల్, గుడిపాల మండల అధ్యక్షుడిగా జై ప్రకాశ్‌ని నియమించారు. తమకు అవకాశం కల్పించిన జగన్, విజయానందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు.

News February 13, 2025

చిత్తూరు: ‘బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు’

image

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువును ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్లు బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. లబ్ధిదారుల నుంచి వస్తున్న వినతులను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తుల గడువు పెంచినట్లు పేర్కొన్నారు. అర్హులైన నిరుద్యోగ యువత స్వయం ఉపాధి యూనిట్ల స్థాపన కోసం దరఖాస్తులు ఈ నెల 15 లోపు అప్లై చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

News February 13, 2025

చిత్తూరు నేతలకు కీలక పదవులు ఇచ్చిన జగన్

image

చిత్తూరు పట్టణ వైసీపీ అధ్యక్షుడిగా కే.పీ. శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే చిత్తూరు రూరల్ అధ్యక్షుడిగా జయపాల్, గుడిపాల మండల అధ్యక్షుడిగా జై ప్రకాశ్‌ని నియమించారు. తమకు అవకాశం కల్పించిన జగన్, విజయనందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు.

error: Content is protected !!