News March 4, 2025

తిరుపతి: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

image

తిరుపతి రూరల్ మండలంలోని విజయనగర్ కాలనీ డాక్టర్ ఆర్.సి రెడ్డి డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తెలిపింది. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. 10, ఇంటర్, డిగ్రీలలో ఉత్తీర్ణులైన యువతి యువకులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

Similar News

News November 14, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు..

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,800గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేటు ధరల్లో సైతం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.

News November 14, 2025

కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు

image

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ఫిర్యాదు మేరకు తాడిపత్రి పట్టణ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈనెల 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ర్యాలీకి వెళ్తున్న పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్న సందర్భంగా తన తల్లిని అసభ్య పదజాలంతో దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దారెడ్డిపై 296, 79, 351(2), 351(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 14, 2025

తగ్గిన బంగారం ధరలు

image

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.