News November 30, 2024
తిరుపతి పరిసర ప్రజలు శుభవార్త
టీటీడీ ధర్మకర్తల మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 3న (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నారు.
Similar News
News December 6, 2024
పుష్ప-2తో తిరుపతిలో ట్రెండ్ మారుతోంది..!
తిరుపతి గంగమ్మ జాతరలో భక్తులు ఒక్కో రోజు ఒక్కో వేషంతో అమ్మవారిని దర్శించుకుంటారు. ఇందులో మాతంగి వేషం కీలకమైంది. మగవారు ఆడవారిలా తయారు కావడమే ఈ వేషం ప్రత్యేకత. పుష్ప-2లో అల్లు అర్జున్ గెటప్ రిలీవ్ కాకముందు సాధారణంగా వేషాలు వేసేవారు. పుష్ప మేనియాతో అందరూ అదే తరహాలో వేషం వేస్తున్నారు. గత జాతరలో MP గురుమూర్తి సైతం ఇలాగే వేషం వేయడం విశేషం. మరి రానున్న జాతరలో ఎంత మంది పుష్పలాగా కనిపిస్తారో చూడాలి మరి.
News December 6, 2024
మదనపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
మదనపల్లె అమ్మచెరువు మిట్టలో ఇవాళ వేకువజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బి.కొత్త కోటమండలం బండమీదపల్లెకు చెందిన నరేశ్ కుమార్ రెడ్డి(26)తోపాటు నీరుగట్టుపల్లె మాయాబజార్‌కు చెందిన దామోదర్ రెడ్డి(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి మహేందర్(20) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 6, 2024
శ్రీ పద్మావతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీపద్మావతి అమ్మవారికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎనిమిదో రోజైన గురువారం రాత్రి శ్రీపద్మావతి అమ్మవారు మహారాణీ అవతారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. టీటీడీ ఈవో చేతులు మీదుగా టీటీడీ ఛైర్మన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.