News March 25, 2025
తిరుపతి: పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్ఓ నరసింహులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పరీక్షలు నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 2,080 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన వివరించారు.
Similar News
News December 7, 2025
TCILలో 150 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<
News December 7, 2025
తెలుగువారి పరువు పోయింది.. రామ్మోహన్ రాజీనామా చేయాలి: అమర్నాథ్

AP: ఇండిగో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మంత్రి రామ్మోహన్ పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ‘చరిత్రలో ఈ తరహా ఇబ్బంది ఎదుర్కోవడం ఇదే తొలిసారి. దేశంలో తెలుగు వారి పరువు, ప్రపంచంలో ఇండియా పరువు పోయింది. అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ సమయంలో ఆయన రీల్స్ చేసుకున్నారనే అపవాదులు వచ్చాయి. రామ్మోహన్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.
News December 7, 2025
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 15 నుంచి గుడివాడకు వందే భారత్

చెన్నై-విజయవాడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సేవను గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు ఈ నెల 15వ తేదీ నుంచి పొడిగిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. అయితే నర్సాపురం, మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్కు వందే భారత్ రైలు నడపాలని ప్రయాణికుల కోరుతున్నారు.


