News December 29, 2024

తిరుపతి: పరీక్షలు వాయిదా

image

తిరుపతి SV యునివర్సిటీ పరిధిలో జరుగుతున్న PG మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణ అధికారి దామ్లా నాయక్ తెలిపారు. ఈ నెల 30 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా.. విద్యార్థుల అభ్యర్థన మేరకు జనవరి 3వ తేదీకి మార్చినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని దామ్లా నాయక్ సూచించారు.

Similar News

News January 22, 2025

చిత్తూరు: మెరిట్ లిస్ట్ విడుదల

image

నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (NUHM) ప్రాజెక్టులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదలైనట్లు చిత్తూరు DMHO సుధారాణి పేర్కొన్నారు. మెరిట్ జాబితాను https://chittoor.ap.gov.in వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు. ఈనెల 28వ తేదీ లోపు అభ్యంతరాలను తెలియజేయాలని సూచించారు.

News January 21, 2025

BJP చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా జగదీశ్వర్ నాయుడు

image

బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా జగదీశ్వర్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కర్నాటి యల్లా రెడ్డి, జిల్లా పరిశీలకులు ముని సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మంగళవారం అధ్యక్ష ఎన్నిక జరిగింది. పార్టీ రాజ్యాంగ సిద్ధాంతాల నియమావళి ప్రకారం ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అనంతరం నియామక పత్రాలను అందజేశారు.

News January 21, 2025

ఎన్‌కౌంటర్‌లో చిత్తూరు జిల్లా వాసి మృతి..?

image

ఛ‌త్తీస్‌గఢ్-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మంగళవారం జ‌రిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమానుపెంటకు చెందిన చలపతి అలియాస్ రామచంద్రా రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన గతంలో అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది.