News September 29, 2024
తిరుపతి: పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఖరారైనట్టు జనసేన నాయకులు తెలిపారు. అక్టోబర్ 2న సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వస్తారని చెప్పారు. అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరి 9 గంటలకు తిరుమల చేరుకుంటారని చెప్పారు. 3వ తేదీ స్వామివారిని దర్శించుకుంటారన్నారు. ఆరోజు సాయంత్రం తిరుపతిలో వారాహి సభకు హాజరవుతారని చెప్పారు.
Similar News
News December 3, 2025
చిత్తూరు: డిప్యూటీ MPDOలకు కీలక బాధ్యతలు

చిత్తూరు జిల్లాలో సచివాలయాలను పర్యవేక్షించేలా డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తున్నారు. మండలంలోని 31 మండలాల్లో 504 గ్రామ సచివాలయాలు, 108 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇప్పటికే 27మంది డిప్యూటీ ఎంపీడీవోలు విధుల్లో చేరారు. సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించేలా వీరు పర్యవేక్షణ చేయనున్నారు.
News December 3, 2025
చిత్తూరు: 10Th, ఇంటర్ చదవాలని అనుకుంటున్నారా?

చిత్తూరు జిల్లాలోని ఓపెన్ స్కూల్లో 10వ తరగతి, ఇంటర్ చదివేందుకు ఈనెల 10వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్లు పొందేవారు ఫీజుతో పాటు తాత్కాల్ రుసుం రూ.600 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు జిల్లాలోని కోఆర్డినేటర్ సెంటర్లు, డీఈవో కార్యాలయంలోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ను సంప్రదించాలని సూచించారు.
News December 3, 2025
చిత్తూరు జిల్లా చిన్నది అవుతుందనే..!

నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉంది. MLA భానుప్రకాశ్ సైతం ఇదే అంశంపై పోరాడారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. చిత్తూరు జిల్లాలో 31మండలాలు ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 4 మండలాలను మదనపల్లె జిల్లాలో కలిపారు. నగరిలోని 3 మండలాలను తిరుపతిలో కలిపిస్తే 24 మండలాలతో చిత్తూరు జిల్లా చిన్నది అవుతుంది. అందుకే నగరి మండలాలను చిత్తూరు జిల్లాలోనే కొనసాగిస్తున్నారని సమాచారం.


