News September 29, 2024
తిరుపతి: పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఖరారైనట్టు జనసేన నాయకులు తెలిపారు. అక్టోబర్ 2న సాయంత్రం నాలుగు గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వస్తారని చెప్పారు. అలిపిరి నుంచి కాలినడకన బయలుదేరి 9 గంటలకు తిరుమల చేరుకుంటారని చెప్పారు. 3వ తేదీ స్వామివారిని దర్శించుకుంటారన్నారు. ఆరోజు సాయంత్రం తిరుపతిలో వారాహి సభకు హాజరవుతారని చెప్పారు.
Similar News
News October 7, 2024
శ్రీవారి గరుడసేవకు విస్తృతమైన ఏర్పాట్లు : టీటీడీ ఈవో
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 8వ తేదీ సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ శ్రీ సుబ్బరాయుడుతో కలిసి ఈవో మీడియా సమావేశం నిర్వహించారు.
News October 6, 2024
జీడీ నెల్లూరులో ఆన్లైన్ బెట్టింగ్‌కు కుటుంబం మొత్తం బలి
గంగాధర నెల్లూరులో ఆన్లైన్ బెట్టింగ్తో అప్పుల పాలైన నాగరాజు కుటుంబ సభ్యులు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిన్న రాత్రి నాగరాజు రెడ్డి మరణించగా శనివారం ఉదయం చికిత్స పొందుతూ ఆయన భార్య జయంతి, సాయంత్రం కుమార్తె సునిత మృతి చెందారు. ఆదివారం ఆయన కొడుకు దినేశ్ రెడ్డి కూడా మరణించాడు. ఆ కుటుంబంలో నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషదఛాయలు అలుముకున్నాయి.
News October 6, 2024
చిత్తూరు: వినాయక విగ్రహం నిమజ్జనంలో అపశ్రుతి
చిత్తూరులోని వినాయక విగ్రహం నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. చిత్తూరు నగరం గుర్రప్పనాయుడువీధికి చెందిన ఆకాశ్(14) కట్టమంచి చెరువులో దిగి కూరుకుపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అకాశ్‌ను వెలికితీసి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చెరువు వద్ద తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కంటతడిపెట్టించాయి. చెరువులోకి ఒక్కడే దిగినట్లు సమాచారం.