News April 11, 2025

తిరుపతి ప్రజలకు గమనిక 

image

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి పన్నులు, ఖాళీ జాగా పన్నులను చెల్లిస్తే 50 శాతం వడ్డీ మినహాయింపు ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం తెలిపారు. 2024-25 సంవత్సరంలో పెండింగ్ ఉన్న బకాయిలు ఏప్రిల్ 30వ తేదీలోపు ఒకేసారి చెల్లిస్తే  ప్రస్తుతమున్న వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బకాయిదారులు వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News December 4, 2025

నాగార్జునసాగర్‌లో సీప్లేన్ ఏర్పాటు చేయాలి.!

image

ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో కూడా సీ ప్లేన్ ఏర్పాటు చేయాలని పల్నాడు ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో 10 చోట్ల సీప్లేన్ వాటర్ డోమ్‌లుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి మురళీ మోహర్ రాజ్యసభ సభ్యుడు బీదర మస్తాన్ రావు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నాగార్జున కొండ వద్ద సిప్లేన్ ఏర్పాటు చేస్తే పల్నాడులో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది.

News December 4, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.220 తగ్గి రూ.1,30,360కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.200 పతనమై రూ.1,19,500 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,000 తగ్గి రూ.2,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 4, 2025

NRPT: భయాందోళనకు గురిచేసేందుకే క్షుద్రపూజలు

image

కోస్గి మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో క్షుద్రపూజలు విద్యార్థులను భయాందోళన గురి చేసే అందుకే చేసి ఉంటారని పాఠశాల హెచ్ఎం జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇట్టి పూజలు చేసిన ఆకతాయిలకు పోలీసులు గుణపాఠం చెప్తారన్నారు. విద్యార్థులకు ధైర్యం చెప్పి పాఠశాలను కొనసాగించినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.